Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. థానేలో అస‌లైన నిందితుడి అరెస్ట్‌!

Bollywood Actor Saif Ali Khan Stabbing Case Accused Arrested In Thane
  • నిన్న‌ అర్ధ‌రాత్రి నిందితుడు విజ‌య్ దాస్‌ను అరెస్ట్ చేసిన‌ పోలీసులు
  • సీసీటీవీ విజువ‌ల్స్ ఆధారంగా అత‌డిని ఓ రెస్టారెంట్ స‌మీపంలో గుర్తించిన‌ట్లు వెల్ల‌డి
  • ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ముంబ‌యి డీసీపీ కార్యాల‌యంలో విలేక‌ర్ల‌ సమావేశం 
  • ఈ మీడియా స‌మావేశంలో కేసు వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్న ముంబ‌యి పోలీసులు
బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన అస‌లైన నిందితుడిని థానేలో ముంబ‌యి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ‌నివారం అర్ధ‌రాత్రి నిందితుడు విజ‌య్ దాస్‌ను అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. సీసీటీవీ విజువ‌ల్స్ ఆధారంగా అత‌డిని ఓ రెస్టారెంట్ స‌మీపంలో గుర్తించిన‌ట్లు తెలిపారు. 

ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ముంబ‌యి డీసీపీ కార్యాల‌యంలో విలేక‌ర్ల‌ సమావేశం ఏర్పాటు చేసి, కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు చెప్పారు. కాగా, అంత‌కుముందు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్ రైల్వేస్టేష‌న్‌లో ఓ అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. 

ఇదిలాఉంటే.. గురువారం నాడు తెల్ల‌వారుజామున సైఫ్‌పై బాంద్రాలోని ఆయ‌న నివాసంలోనే దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న ప్ర‌స్తుతం లీలావ‌తి ఆసుప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ ఘ‌ట‌నతో బాలీవుడ్ వ‌ర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిప‌డ్డాయి.

Saif Ali Khan
Stabbing Case
Thane
Bollywood

More Telugu News