Balakrishna: ఎన్‌టీఆర్‌తోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం: బాలకృష్ణ

- ఎన్‌టీఆర్ వర్థంతి సందర్భంగా బాలకృష్ణ నివాళులు
- హైదరాబాద్ ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన బాలయ్య
- నటుడిగా, నాయకుడిగా ఎన్‌టీఆర్ తనకు తానే సాటి అని ప్రశంస
- ప్రజల వద్దకు పాలన కోసం ఎన్‌టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని వ్యాఖ్య
తన తండ్రి ఎన్‌టీఆర్ వర్థంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో పాటు రామకృష్ణ, నందమూరి సుహాసిని, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... నటుడిగా, నాయకుడిగా ఎన్‌టీఆర్ తనకు తానే సాటి అని పేర్కొన్నారు.పేదల కోసం టీడీపీని స్థాపించారని, ఆయనతోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని బాలయ్య గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలన కోసం ఎన్‌టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు.
తెలుగు రాజకీయాలు ఎన్‌టీఆర్‌కు ముందు.. తర్వాత అనే విధంగా మారాయని కొనియాడారు. ఇప్పటికీ ఆయన తెచ్చిన పథకాలనే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, వివిధ వర్గాలకు ఎన్‌టీఆర్ దైవ సమానంగా నిలిచారని చెప్పారు. మద్రాసు నగరానికి మంచి నీళ్లిచ్చిన మహానభావుడు ఎన్‌టీఆర్ అని అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారుచేసింది కూడా ఎన్‌టీఆర్ మాత్రమేనని బాలయ్య చెప్పుకొచ్చారు.