coal india recruitment 2025: కోల్ ఇండియాలో ఉద్యోగ నియామకాలు... వివరాలు ఇవిగో!

applications invites for management trainee posts by coal india recruitment 2025
  • 434 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కోల్ ఇండియా లిమిటెడ్
  • దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 14
  • రూ.50 వేల నుంచి రూ.1.8 లక్షల వరకూ జీతం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 434 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి కోల్ ఇండియా చర్యలు చేపట్టింది. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కమ్యూనిటీ డెవలప్ మెంట్ 20, పర్యావరణం 28, ఫైనాన్స్ 103, లీగల్ 18, మార్కెటింగ్ అండ్ సేల్స్ 25, మెటీరియల్ మేనేజ్‌మెంట్ 44, పర్సనల్ అండ్ హెచ్ ఆర్ 97, సెక్యూరిటీ 31, కోల్ ప్రిపరేషన్ 68 పోస్టులు ఉన్నాయి. 

అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్వుడ్ కేటాగిరి వర్గాల వారికి వయో సడలింపు నిబంధనలు వర్తించనున్నాయి. 

ఎంపిక విధానం
ఈ ఉద్యోగాలకు సీబీటీ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

వేతనాలు
ఈ 2 గ్రేడ్ వారికి రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల జీతం
ఈ 3 గ్రేడ్ వారికి రూ.60 వేల నుంచి రూ.1.8 లక్షలు
  
అప్లికేషన్ ఫీజు వివరాలకు వస్తే .. జనరల్, ఓబీసీ క్రిమీలేయర్ అండ్ నాన్ క్రిమీలేయర్, ఈడబ్ల్యుఎస్ కేటగిరి అభ్యర్ధులకు రూ.1000, జీఎస్టీ రూ.180లు కలిపి మొత్తం రూ.1180లు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆసక్తికల అభ్యర్ధులు ఫిబ్రవరి 14 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు పూర్తి వివరాల కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.  
coal india recruitment 2025
management trainee posts
Jobs

More Telugu News