Saif Ali Khan: సైఫ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చిన తల్లి షర్మిలా ఠాగూర్

Sharmila Tagore visits injured son Saif Ali Khan in a knife attack

  • గత రాత్రి తన నివాసంలో కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్
  • ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స
  • ఘటన పట్ల దిగ్భ్రాంతికి గురైన సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురవడం తెలిసిందే. గత రాత్రి జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సైఫ్ ఒంటిపై 6 కత్తిపోట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. సైఫ్ కు శస్త్రచికిత్స చేసి వెన్నులో ఇరుక్కుపోయిన కత్తి మొనను తొలగించారు. ప్రస్తుతం సైతం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కాగా, సైఫ్ తల్లి, అలనాటి నటి షర్మిలా ఠాగూర్ ఈ సాయంత్రం లీలావతి ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్న కుమారుడ్ని పరామర్శించారు. కత్తిపోట్ల ఘటన పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షర్మిలా ఠాగూర్ రాకకు ముందే సైఫ్ ను పలువురు బాలీవుడ్ తారలు పరామర్శించారు. సంజయ్ దత్, మలైకా అరోరా, రణబీర్ కపూర్, అలియా భట్ తదితరులు పరామర్శించారు.

Saif Ali Khan
Sharmila Tagore
Mumbai
Bollywood
  • Loading...

More Telugu News