Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల

Lilavati Hospital has issued a statement regarding the attack on Saif Ali Khan

  • సైఫ్‌ శరీరంపై మొత్తం ఆరు కత్తిపోట్లు ఉన్నాయని ప్రకటించిన లీలావతి హాస్పిటల్ వైద్యులు
  • మెడ, వెన్నెముకపై లోతైన గాయాలు అయినట్టు వెల్లడి
  • సైఫ్ అలీ ఖాన్ ఇంటి సిబ్బందిని ప్రశ్నిస్తున్న పోలీసులు
  • సీసీ ఫుటేజీల ఆధారంగా దుండగుడి ముఖం గుర్తింపు!

దేశవ్యాప్తంగా అభిమానులను కలిగివున్న బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇవాళ (గురువారం) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో  ఆయన నివాసంలోనే కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన అతడిని ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

సైఫ్ అలీఖాన్‌ శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయని, అందులో రెండు లోతైన తీవ్ర గాయాలని వైద్యులు ప్రకటించారు. మెడ, వెన్నెముకపై కత్తి పోట్లు లోతుగా దిగాయని వివరించారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.

సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనపై పోలీసులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించామని తెలిపారు. సైఫ్‌కు, దుండగుడికి మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగిందని, ఈ క్రమంలోనే సైఫ్ కత్తిపోట్లకు గురయ్యారని వాంగ్మూలంలో పోలీసులు పేర్కొన్నారు. 

మరోవైపు, ముంబై పోలీసులు బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ నివాసానికి చేరుకొని ఇంట్లో పనిచేసే సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీలలో దుండగుడి కదలికలు నమోదయాయి. ఇంట్లో చోరీకి ప్రయత్నించినట్లు తెలుస్తోందని, అభిమానులు ఓపిక పట్టాలంటూ సైఫ్‌ అలీఖాన్‌ టీమ్‌ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, సైఫ్ అలీఖాన్ చివరిగా 'దేవర: పార్ట్ 1'లో సినిమాలో మెప్పించిన విషయం తెలిసిందే.

Saif Ali Khan
Attack on Saif Ali Khan
Crime News
Bollywood
  • Loading...

More Telugu News