Nazriya Nazim: 'పుష్ప' విలన్ ఆ వ్యాధితో బాధపడుతున్నారట.. షాకింగ్ విషయం బయటపెట్టిన భార్య!

- ఫహాద్ ఫాజిల్ కొన్ని నెలల నుంచి ఏడీహెచ్‌డీతో బాధపడుతన్నట్లు చెప్పిన భార్య నజ్రియా
- ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఎప్పుడూ పరధ్యానం, చికాకు కలిగి ఉంటారని వెల్లడి
- అలాగే హైపర్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుందన్న నటి
- నజ్రియా వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్
'అంటే సుందరానికి' మూవీలో నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్‌గా నటించిన నజ్రియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతకుముందు ప్రముఖ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'రాజారాణి' ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే, ఈమె భర్త ఫహాద్ ఫాజిల్ కూడా స్టార్ నటుడు అనే విషయం తెలిసిందే.
సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీలో భన్వర్‌సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రతినాయకుడిగా నటించి ఫహాద్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నజ్రియా తన భర్త గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆయన ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఫహాద్ కొన్ని నెలల నుంచి 'ఏడీహెచ్‌డీ'తో బాధపడుతన్నట్లు పేర్కొంది.
ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఎప్పుడూ పరధ్యానం, చికాకు కలిగి ఉంటారని నజ్రియా తెలిపారు. అలాగే ఈ వ్యాధి ఉన్నవారిలో హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ, అతని పరిస్థితి గురించి తెలియకముందే తాను ఫహాద్‌తో జీవించడం ప్రారంభించానని, అతని వ్యక్తిత్వ లక్షణాలకు చాలా కాలంగా తాను అలవాటు పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. నజ్రియా వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫహాద్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.