CPI: సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు చుక్కెదురు

Shock to Kunamneni in Kothagudem
  • అసెంబ్లీ ఎన్నికల్లో కూనంనేని అఫిడవిట్ సరిగ్గా దాఖలు చేయలేదని పిటిషన్
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంకట్రావు
  • క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన వెంకట్రావు
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసిన తన ప్రత్యర్థి వెంకట్రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే ఈ పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో అఫిడవిట్ సరిగ్గా దాఖలు చేయలేదంటూ వెంకట్రావు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో సాంబశివరావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సాంబశివరావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, అక్కడా చుక్కెదురైంది.
CPI
Bhadradri Kothagudem District
TS High Court
Supreme Court

More Telugu News