Mystery Desease: జమ్ము కశ్మీర్ లో మిస్టరీ వ్యాధి.... 13కి పెరిగిన మరణాల సంఖ్య

13 Children died due to mystrey desease in Jammu Kashmir
  • రాజౌరీ జిల్లాలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న వ్యాధి
  • చిన్నారులను కబళిస్తున్న వ్యాధి
  • బధాల్ గ్రామంలో అత్యధికంగా మరణాలు
జమ్ము కశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో చిన్నారులు మృత్యువాత పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో చిన్నారి కూడా వ్యాధి ఏమిటో తెలియకుండానే మరణించడంతో, ఇప్పటిదాకా ఈ మిస్టరీ జబ్బుతో ప్రాణాలు విడిచిన చిన్నారుల సంఖ్య 13కి పెరిగింది. 

డిసెంబరు 24 నుంచి మృత్యు ఘంటికలు మోగిస్తున్న ఈ వ్యాధితో ఒక్క బధాల్ గ్రామంలోనే అత్యధికంగా చిన్నారులు మరణించారు. దాంతో, బధాల్ గ్రామంలో ప్రజలు హడలిపోతున్నారు. ఈ జబ్బు బారినపడిన పిల్లలను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. అధిక జ్వరం, తీవ్రంగా చెమటలు పట్టడం, వాంతులు, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోతుండడం... ఈ మిస్టరీ వ్యాధి లక్షణాలు.

దీనిపై రాజౌరీ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ అశుతోష్ గుప్తా స్పందించారు. ప్రాథమికంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని భావిస్తున్నామని, మరిన్ని పరీక్షల తర్వాత దీనిపై ఓ నిర్ధారణకు వస్తామని వెల్లడించారు. 

అటు, ఈ వ్యాధి ఏమిటన్నది తెలుసుకునేందుకు పుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పీజీఐ (చండీగఢ్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎయిమ్స్ వంటి ప్రఖ్యాత సంస్థల నుంచి నిపుణులు బధాల్ గ్రామానికి తరలివెళ్లారు.
Mystery Desease
Children
Deaths
Rajouri District
Jammu And Kashmir

More Telugu News