Chandrababu: ఒకే పోస్ట‌ర్‌లో చంద్ర‌బాబు, బాల‌య్య‌, కేసీఆర్‌.. నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ ఫ్లెక్సీ!

Chandrababu With KCR and Balakrishna in One Poster goes Viral on Internet

  


సంక్రాంతి వేళ ఏపీ సీఎం చంద్ర‌బాబు, బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌, న‌టుడు బాకృష్ణ‌ల‌తో కూడిన ఫ్లెక్సీ నెట్టింట వైర‌ల్ అవుతోంది. చంద్ర‌బాబు ఫొటో కింద 'బాస్ ఈజ్ బ్యాక్‌', బాల‌య్య ఫొటో కింద 'డాకు మ‌హారాజ్‌', కేసీఆర్ ఫొటో కింద 'బాస్ ఈజ్ క‌మింగ్ సూన్' అని రాయ‌డం జ‌రిగింది. 

ఈ ఫ్లెక్సీలో కేటీఆర్, మంత్రి నారా లోకేశ్, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, మోక్ష‌జ్ఞ ఫొటోలు కూడా ఉన్నాయి. తెలంగాణ‌, ఆంధ్ర స‌రిహ‌ద్దులో ఉండే ఖ‌మ్మం జిల్లా ముగ్గు వెంక‌టాపురంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లిన కొంద‌రు ఈ పోస్ట‌ర్‌ను ఫొటో తీసి, నెట్టింట పెట్ట‌డంతో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 

Chandrababu
KCR
Balakrishna
  • Loading...

More Telugu News