Chandrababu: రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబును కలిసిన టీటీడీ చైర్మన్... పలు సూచనలు చేసిన సీఎం

TTD Chairman BR Naidu met CM Chandrababu in Renigunta airport
  • నేడు తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
  • ఎయిర్ పోర్టులో సీఎంకు స్వాగతం పలికిన బీఆర్ నాయుడు తదితరులు
  • టీటీడీలోని అన్ని అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించారు. రేణిగుంట విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన అనంతరం... ఆయనతో పలు అంశాలపై చర్చించారు. 

ఇటీవల తిరుపతిలో టోకెన్ జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో మరణించిన భక్తుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం అందించేందుకు పాలకమండలి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని చంద్రబాబుకు వివరించారు. బాధితులకు పరిహారం అందిస్తున్న విషయాన్ని తెలియజేశారు. 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి పలు సూచనలు చేశారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. టీటీడీలోని అన్ని అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని బీఆర్ నాయుడికి ప్రత్యేకంగా సూచించారు.
Chandrababu
BR Naidu
TTD
Tirupati

More Telugu News