Anand Mahindra: వారానికి 90 గంటల పని వివాదంపై ఆనంద్ మహీంద్ర ఏమన్నారంటే..?

Anand Mahindras cheeky reply to 90 hour work week debate

  • ఎన్ని గంటలు పని చేశామని కాదు ఎంత సమర్థవంతంగా చేశామనేదే ముఖ్యమని వ్యాఖ్య
  • నా భార్య ఓ అద్భుతం.. ఆమెను చూస్తూ ఉండిపోవడం నాకెంతో ఇష్టమన్న మహీంద్రా గ్రూప్ చైర్మన్
  • తన వరకూ సోషల్ మీడియా ఓ గొప్ప బిజినెస్ టూల్ అని వెల్లడి

వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఎల్ అండ్ టి కంపెనీ చీఫ్ ఎస్ఎన్ సుబ్రహ్మణియన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇంట్లో భార్య ముఖం చూస్తూ ఎంతసేపు కూర్చుండిపోతారని ఆయన ప్రశ్నించారు. ఆదివారాలూ ఆఫీసుకు వచ్చి పనిచేయాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తాజాగా ఈ వివాదంపై స్పందిస్తూ.. తన భార్య ఓ అద్భుతమైన వ్యక్తి అని ఆమెను చూస్తూ ఉండిపోవడం తనకెంతో ఇష్టమని చెప్పారు. వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నామనేది ముఖ్యం కాదని, ఆ పనిని ఎంత సమర్థవంతంగా పూర్తిచేశామనేదే ముఖ్యమని చెప్పారు.

క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలని వివరించారు. ఓ పెద్ద కంపెనీకి చైర్మన్ గా నిత్యం బిజీబిజీగా ఉండే తాను ఇలా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడంపై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తుంటారని అన్నారు. తాను సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేస్తున్నానని మరికొందరు కామెంట్లు పెడుతుంటారని చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వెనక తన ఉద్దేశం, తన లక్ష్యం వేరని ఆనంద్ మహీంద్ర చెప్పారు. కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి తాను ఇక్కడ (సోషల్ మీడియాలో) లేనని, తన వరకూ సోషల్ మీడియా ఓ గొప్ప బిజినెస్ టూల్ అని వివరించారు. ఒకే వేదికపై కోటి మందికి పైగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ పొందే అవకాశం తనకు ట్విట్టర్ ద్వారా కలుగుతోందని చెప్పారు. ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ లో 11 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Anand Mahindra
Mahindra Group
90 Hour work
L And T
  • Loading...

More Telugu News