రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం

  • రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాకర్స్ కు కనిపించిన చిరుత
  • ఒక్కసారిగా భయాందోళనకు గురైన వాకర్స్ 
  • విశ్వవిద్యాలయం విద్యార్ధుల్లో ఆందోళన
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం మార్నింగ్ వాక్‌ చేస్తున్నవారు చిరుతను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయినట్లు వాకర్స్ తెలిపారు. చిరుత పాద ముద్రలను వాకర్స్ గుర్తించారు.

ఈ విషయం తెలియడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. రాజేంద్రనగర్‌లో ఇంతకుముందు కూడా చిరుత సంచారం కలకలం రేపింది. నాలుగేళ్ల క్రితం హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ వ్యూమ్ హౌస్ సమీపంలో ఆవులపై చిరుత దాడి చేసింది. ఒక ఆవు దూడను చిరుత చంపడం అప్పట్లో తీవ్ర కలకలాన్ని కలిగించింది. ఇప్పుడు ఏకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలోకి చిరుత రావడం ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.


More Telugu News