తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నించి దొరికిన ఉద్యోగి

    
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి ప్రయత్నించిన ఓ బ్యాంకు ఉద్యోగి కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. నిందితుడిని పెంచలయ్యగా గుర్తించారు. వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ను దాచి బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది అతడిని పట్టుకుని తిరుమల వన్‌టౌన్ పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News