kalpra vfx and ai services: మన తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్‌తో పోటీ పడాలంటే ఇలాంటివి అవసరం: హరీశ్ రావు

- హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ సర్వీసెస్ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు
- బాలీవుడ్, హాలీవుడ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ పోటీపడుతోందన్న హరీశ్ రావు
- హాలీవుడ్‌తో మరింత పోటీని ఎదుర్కోవాలంటే ఇలాంటి టెక్నాలజీ అవసరమన్న హరీశ్ రావు
సినిమా ఇండస్ట్రీలో వీఎఫ్ఎక్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. నిర్మాణ సంస్థలు టెక్నాలజీని ఉపయోగిస్తూ సంచలనాలను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ సర్వీసెస్ తమ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్‌తో పోటీ పడుతోందని, హాలీవుడ్‌తో మరింత పోటీని ఎదుర్కోవాలంటే ఇలాంటి టెక్నాలజీ అవసరమని అన్నారు.
సినిమా బడ్జెట్‌ను తగ్గిస్తూ.. విజువల్ ఎఫెక్ట్స్‌ను పెంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఏఐ వెంట పరుగెడుతోందని అన్నారు. అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చి ఇది స్థాపించిన మల్లీశ్వర్ ఇంకా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతన బ్రాంచి సీఈవో డాక్టర్ మల్లీశ్వర్, డైరెక్టర్ శ్రీను వైట్ల, కరుణ కుమార్, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన, నటులు విక్రాంత్ రెడ్డి, రఘు కంచె తదితరులు పాల్గొన్నారు.