Nara Lokesh: విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh thanked CM Chandrababu for pending bills clearence
  • బకాయిలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం
  • రూ.6,700 బకాయిలు విడుదల చేస్తున్నామని వెల్లడి
  • చంద్రబాబు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
  • విద్యార్థులకు రూ.788 కోట్ల బకాయిలు చెల్లింపు
ఏపీలో వివిధ వర్గాలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నేడు నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.6,700 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. విద్యార్థుల కూడా బకాయిలు చెల్లిస్తున్నామని తెలిపారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కంస మామ మోసం చేసి పోతే మన చంద్రన్న న్యాయం చేస్తున్నారని కొనియాడారు.

 "జగన్ రెడ్డి గారు ఫీజు బకాయిలు పెట్టి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారు. తాను పెట్టిన బకాయిలు ప్రజా ప్రభుత్వం తీర్చాలని రోడ్డెక్కిన ఘనత కూడా ఆయనకే దక్కింది. గత పాలకులు చేసిన పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను విద్యా శాఖా మంత్రి అయిన వెంటనే కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. 

దశల వారీగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం అని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు రూ.788 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. పండుగ వేళ విద్యార్థులకు తీపి కబురు అందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు. ఏపీకి ఇది సంక్రాంతి కానుక" అని లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Nara Lokesh
Chandrababu
Students
Pending Bills
Sankranti
TDP-JanaSena-BJP Alliance

More Telugu News