Mohammad Shami: షమీ వచ్చేశాడు... ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు ప్రకటన

Shami returns as BCCI announces Team India for T20 Series with England
  • టీమిండియా-ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • జనవరి 22 నుంచి సిరీస్
  • సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి షమీ పునరాగమనం
  • 15 మందితో జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు
స్టార్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి పునరామగనం చేశాడు. ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం నేడు భారత జట్టును ప్రకటించారు. అందులో షమీకి కూడా స్థానం కల్పించారు. 

ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ఫ్రిబవరి 2 వరకు జరగనుంది. నేడు సమావేశమైన బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో అదరగొట్టిన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ జట్టులో ఉన్నాడు. 

టీమిండియా...
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).

టీమిండియా-ఇంగ్లండ్ టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20: జనవరి 22 (కోల్ కతా)
రెండో టీ20: జనవరి 25 (చెన్నై)
మూడో టీ20: జనవరి 28 (రాజ్ కోట్)
నాలుగో టీ20: జనవరి 31 (పుణే)
ఐదో టీ20: ఫిబ్రవరి 2 (ముంబయి)
Mohammad Shami
Team India
T20 Series
England

More Telugu News