Congress: భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

Congress attack on BRS office in Bhuvanagiri
  • ధ్వంసమైన ఫర్నీచర్, అద్దాలు
  • రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని యూత్ కాంగ్రెస్ ఆగ్రహం
  • ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్న కాంగ్రెస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో బీఆర్ఎస్ కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
Congress
BRS
Telangana
Yadadri Bhuvanagiri District

More Telugu News