Ramcharan: ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్.. అమ్మాయిది ఎక్కడంటే..!
- ఎన్‌బీకే అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన
- దీనిపై చెర్రీ స్పందిస్తూ పెళ్లి కూతురు ఎవరో చెప్పనప్పటికీ ఎక్కడివారో చెప్పారని టాక్
- అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఉంటారని చెప్పినట్లు సమాచారం
- ఈ నెల 14న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్
రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే తెరపైకి ఎన్నో ప్రచారాలు వచ్చాయి. అయితే, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ వివాహం గురించి ఆయన స్నేహితుడు, హీరో రామ్ చరణ్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చింది.
ప్రభాస్ పరిణయం గురించి బాలయ్య ప్రస్తావించగా.. దీనిపై చెర్రీ స్పందిస్తూ పెళ్లి కూతురు ఎవరో చెప్పనప్పటికీ ఎక్కడివారో చెప్పారని టాక్. అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఉంటారని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సెలబ్రిటీ టాక్ షోలో గేమ్ ఛేంజర్ మూవీ ప్రచారంలో భాగంగా గ్లోబల్ స్టార్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ తొలిభాగం ఈ నెల 8న ప్రసారమైంది.
ఇందులో చెర్రీ పలు విశేషాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన గారాలపట్టి క్లీంకార గురించి చాలా బాగా మాట్లాడారు. ఆమె ముఖాన్ని ఎప్పుడు రివీల్ చేస్తారనే బాలయ్య ప్రశ్నకు మెగా పవర్ స్టార్ బదులిచ్చారు. ఎప్పుడైతే క్లీంకార తనను నాన్న అని పిలుస్తుందో అప్పుడు ప్రపంచానికి ఆమె ముఖాన్ని చూపిస్తానని చెప్పుకొచ్చారు. కాగా, పూర్తి ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రసారం కానుంది. ఇందులో ప్రభాస్‌కు రామ్ చరణ్‌తో బాలయ్య ఫోన్ చేయించారు. అలాగే తన ఇద్దరూ స్నేహితులు హీరో శర్వానంద్, విక్కీతో కలిసి చరణ్ పాల్గొన్నారు.