ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు... బంజారాహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు
- నిన్న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
- అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు
- బీఆర్ఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించినట్లు ఫిర్యాదు
ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, క్రిశాంక్, జైసింహ తదితరులపై కేసు నమోదు చేశారు. కాగా, ఫార్ములా ఈ- కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.