Pawan Kalyan: అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan inspected the area where two fans dead
  • 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం
  • ఇద్దరు అభిమానుల మృతి
  • పిఠాపురంకు వెళ్తూ ప్రమాదస్థలిని పరిశీలించిన పవన్
'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరై ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన మణికంఠ (23), చరణ్ (22) రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన కాకినాడ - రాజమండ్రి మధ్య ప్రమాదస్థలిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు పరిశీలించారు.

ఏడీబీ రోడ్డు మీదుగా పిఠాపురంకు వెళుతున్న పవన్ మార్గమధ్యంలో ఉన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

ఈనెల 4న రాంచరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు జనసేన తరపున రూ. 5 లక్షల చొప్పున పవన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ కూడా రూ. 5 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. 
Pawan Kalyan
Janasena

More Telugu News