Pawan Kalyan: పవన్ మాట్లాడుతుండగా జగన్ వచ్చాడు... వీడియో ఇదిగో!

Jagan enters hospital while Pawan Kalyan talking with media
  • తిరుపతి స్విమ్స్ లో క్షతగాత్రులను పరామర్శించిన పవన్
  • ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతుండగా జగన్ ఎంట్రీ
  • ఈలలు, కేకలతో మార్మోగిన ఆసుపత్రి ప్రాంగణం
  • ఎవరది అంటూ ప్రశ్నించిన పవన్... 
  • జగన్ వచ్చాడు సార్ అని బదులిచ్చిన జనసేన నేత
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఆసుపత్రిలో ఒక్కసారిగా కోలాహలం నెలకొంది. ఈలలు, కేకలతో ఆసుపత్రి ప్రాంగణం మార్మోగిపోయింది. 

దాంతో పవన్ ప్రసంగం ఆపి పక్కనే ఉన్న జనసేన నేతను ఏంటది అని అడిగారు. దాంతో ఆ నేత... జగన్ మోహన్ రెడ్డి వచ్చారు సార్ అని బదులిచ్చారు. అనంతరం పవన్ తన ప్రసంగం కొనసాగించారు. ఇవాళ జగన్ కూడా స్విమ్స్ లో తొక్కిసలాట బాధితులను పరామర్శించడం తెలిసిందే.
Pawan Kalyan
Jagan
SVIMS
Tirupati Incident
TTD

More Telugu News