Ajit: దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లో హీరో అజిత్ కారుకు ప్రమాదం

Hero Ajit car crashes in Dubai Racing during practice session
  • జనవరి 11, 12 తేదీల్లో దుబాయ్ లో ఎండ్యూరెన్స్ కార్ రేసింగ్
  • పాల్గొంటున్న హీరో అజిత్
  • నేడు ప్రాక్టీస్ సెషన్ లో అపశ్రుతి
  • అదుపు తప్పి గోడను ఢీకొట్టిన అజిత్ కారు
కోలీవుడ్ హీరో అజిత్ మంచి బైక్, కార్ రేసర్ అని తెలిసిందే. అయితే, దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లో ఆయన కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం డ్యామేజి అయింది. అజిత్ క్షేమంగా ఉన్నారు. 

దుబాయ్ లో 24హెచ్ 2025 ఎండ్యూరెన్స్ రేస్ జరగనుంది. ఈ రేసింగ్ ఈవెంట్ జనవరి 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నారు. దీంట్లో అజిత్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకోసం ఆయన ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా, ట్రాక్ పై అజిత్ కారు దూసుకుపోతుండగా, ఉన్నట్టుండి అదుపు తప్పింది. గోడను ఢీకొట్టి గిర్రున తిరుగుతూ నిలిచిపోయింది. ఈవెంట్ భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అజిత్ ను మరో వాహనంలో అక్కడ్నించి తరలించారు.
Ajit
Car Crash
Dubai
Kollywood

More Telugu News