బీజేపీ, కాంగ్రెస్‌లపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు
- పంజాబ్‌లో హామీలు నెరవేర్చలేదంటూ కేజ్రీవాల్ నివాసం ఎదుట మహిళల ధర్నా
- బీజేపీ, కాంగ్రెస్ కావాలని తమపై దాడి చేస్తున్నాయని కేజ్రీవాల్ ఆగ్రహం
- ఢిల్లీలో రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని ఆరోపణ
- తమపై ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని బీజేపీ, కాంగ్రెస్ ప్రకటన చేయాలని డిమాండ్
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ పలువురు మహిళలు ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసం వద్ద నిరసనకు దిగారు. ఈ నిరసనపై కేజ్రీవాల్ స్పందించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కావాలని తమపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో కూటమిగా ఏర్పడి తమపై దాడి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తన ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన మహిళలు ఆ రెండు పార్టీలకు చెందిన వారేనని ఆరోపించారు. ఆ మహిళలు పంజాబ్ నుంచి రాలేదన్నారు. పంజాబ్‌లో తమకే మద్దతు ఉందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై పోటీ చేస్తున్నామని బీజేపీ, కాంగ్రెస్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.