విజయసాయిరెడ్డికి ఈడీ మళ్లీ నోటీసులు
- కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేతకు ఈడీ నోటీసులు
- ఇప్పటికే జారీ చేసిన పలు నోటీసులకు వివిధ కారణాలతో విచారణకు హాజరుకాని వైనం
- తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ.. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశం
- కాకినాడ పోర్టులో కేవీ రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారని విజయసాయిపై ఆరోపణలు
కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, సెజ్‌లో కర్నాటి వెంకటేశ్వర రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారని విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేవీ రావు ఫిర్యాదును పరిశీలించిన ఈడీ.. విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది.
ఈమేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్పటికే జారీ చేసిన నోటీసులకు పలు కారణాలతో విచారణకు హాజరుకాలేనంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక తాజా నోటీసుల నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.