railway board: రైల్వే శాఖలో 32 వేల ఉద్యోగాలు.... వివరాలు ఇవిగో!

railway board relaxes educational criteria for level 1 posts
  • రైల్వే శాఖలో 32వేల లెవెల్ 1 (గ్రూపు డి) పోస్టుల భర్తీకి చర్యలు
  • ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పోస్టులు
  • జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
  • కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించిన రైల్వే బోర్డు
నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 32వేల లెవెల్ 1 (గ్రూపు డి ) పోస్టుల భర్తీకి రైల్వే బోర్డు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విద్యార్హతల విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది. 

కొత్త ప్రమాణాల ప్రకారం.. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల విడుదలైన నోటీసులో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత పదో తరగతితో పాటు ఎన్ఏసీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొంది. అయితే తాజాగా, ఆ విద్యార్హత ప్రమాణాలను సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది. 
 
రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా దాదాపు 32 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించనున్నారు. ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి వయో పరిమితి (జనవరి 7, 2025 నాటికి) 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. 

నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్ధులకు వయో సడలింపు కల్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ప్రారంభ జీతం రూ.18 వేలు. 
railway board
railway jobs
educational criteria

More Telugu News