Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన ఏపీ జేఏసీ యూనియన్ నాయకులు

AP JAC union leaders meet Minister Nadendla Manohar
  • సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో కలిసిన జేఏసీ నాయకులు
  • డైరీని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన నాయకులు
  • మంత్రితో వివిధ సమస్యలపై చర్చించిన జేఏసీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏపీ జేఏసీ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయం రెండో బ్లాక్ మొదటి ఫ్లోర్‌లోని మంత్రి ఛాంబర్‌లో జేఏసీ నాయకులు మంత్రిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం, నూతన సంవత్సర డైరీని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రిని కలిసిన వారిలో ఏపీ జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్, పోలీసు అధికారులు, వీఆర్ఏ-వీఆర్వో యూనియన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ యూనియన్, ఔట్ సోర్సింగ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు మంత్రితో వివిధ సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి సహకారం అందించాలని కోరారు.
Nadendla Manohar
Andhra Pradesh
JAC
Janasena

More Telugu News