సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
- తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశం
- సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరిపించాలని సూచన
- నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం
ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసు బాసులను ఆదేశించింది. సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని తెలిపింది. సంధ్య థియేటర్ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.