Sandhya Theatre: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

NHRC notices to Sandhya theatre issue
  • తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశం
  • సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరిపించాలని సూచన
  • నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) నోటీసులు ఇచ్చింది. పుష్ప-2 విడుదల సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసు బాసులను ఆదేశించింది. సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని తెలిపింది. సంధ్య థియేటర్ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Sandhya Theatre
Telangana
Pushpa

More Telugu News