Ethiopia: వివాహ వేడుక నుంచి వస్తున్న ట్రక్కు నదిలో పడి 71 మంది జలసమాధి

71 People killed in Ethiopia Road Accident
  • ఇథియోపియాలోని సిదమా జిల్లాలో నిన్న సాయంత్రం ఘటన
  • మృతుల్లో 68 మంది పురుషులే
  • గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమం
దక్షిణ ఇథియోపియాలో నిన్న సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ వివాహానికి హాజరైన బృందం తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 71 మంది జల సమాధి అయ్యారు. సిదమా రాష్ట్రంలోని గెలాన్ వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయింది.

నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, సహాయక చర్యలు అందడంలో ఆలస్యం కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్టు చెబుతున్నారు. మృతుల్లో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Ethiopia
Ethiopia Road Accident
International News

More Telugu News