ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను... ఆర్థిక సాయం చేయండి: మనీష్ సిసోడియా
- క్రౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించిన సిసోడియా
- ప్రజల ఆర్థిక సాయం వల్లే పలుమార్లు గెలిచానన్న సిసోడియా
- ఈ ఎన్నికల్లోనూ మీ ఆర్థిక సాయం కావాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
జంగ్‌పుర్ నుంచి పోటీ చేసేందుకు తాను క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించానని సిసోడియా వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసి, విజయాలు సాధించానంటే అందుకు ప్రజలే కారణమన్నారు. వారి ఆర్థిక సహకారం వల్లే పలుమార్లు గెలిచినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ మీ ఆర్థిక సాయం కావాలంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.