Team India: టీమిండియా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేరాలంటే ఇలా జ‌ర‌గాలి..!

South Africa in the World Test Championship Final What about India Here are the Conclusions
  • తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి దక్షిణాఫ్రికా 
  • పాకిస్థాన్‌పై టెస్టు విజ‌యంతో ఫైన‌ల్‌కి దూసుకెళ్లిన‌ స‌ఫారీలు
  • రెండో స్థానం కోసం ఆసీస్‌, భార‌త్ మ‌ధ్య పోటీ
దక్షిణాఫ్రికా తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆదివారం సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌పై రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన స‌ఫారీలు ఫైన‌ల్‌కి దూసుకెళ్లారు. ప్ర‌స్తుతం దక్షిణాఫ్రికా 66.67 పాయింట్ల‌తో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 

అలాగే ఆస్ట్రేలియా (58.89), భారత్ (55.88) వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో ఉండ‌గా.. న్యూజిలాండ్ (48.21) నాలుగో స్థానంలో, శ్రీలంక (45.45) ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాయి. దీంతో ద‌క్షిణాఫ్రికాతో ఫైన‌ల్ ఆడే రెండో స్థానం కోసం ఆసీస్‌, భార‌త్ పోటీ ప‌డుతున్నాయి. 

భార‌త్ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేరాలంటే స‌మీక‌ర‌ణాలు ఇలా..!
ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న‌ బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్‌ సిరీస్‌లో భార‌త్ ఒక్క మ్యాచ్ ఓడినా.. మొద‌టికే మోసం వ‌స్తుంది. అందుకే ప్ర‌స్తుతం మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న టెస్టును డ్రాగా ముగించాలి. ఆ త‌ర్వాత సిడ్నీ వేదిక‌గా జ‌రిగే ఐదో టెస్టులో గెల‌వాలి. 

అలాగే శ్రీలంక తమ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను 0-1తో ఓడిస్తే భారత్ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ బీజీటీ సిరీస్‌ 2-2తో ముగిస్తే, శ్రీలంకపై ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోతే భారత్ నేరుగా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కి వెళ్తుంది.
Team India
World Test Championship Final
South Africa
Australia
Cricket
Sports News

More Telugu News