తెలంగాణలో డిసెంబర్ 31న వైన్ షాపులు ఎప్పటి దాకా తెరిచి ఉంటాయంటే..!
- అర్ధరాత్రి 12 గంటల వరకు తెరచుకోవచ్చన్న తెలంగాణ సర్కారు
- న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నిర్ణయం
- రాత్రి ఒంటి గంట దాకా బార్లు, రెస్టారెంట్లకు అనుమతి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే స్పెషల్ ఈవెంట్లకు పలు షరతులతో అనుమతినిచ్చింది. పార్టీలు, పబ్ లలో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించింది. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, వైన్ షాపులు అర్ధరాత్రి దాకా తెరిచి ఉంచేందుకు అనుమతినివ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారవర్గాలు తెలిపాయి.