Raghurama Custodial Torture Case: రఘురామ కేసు: విజయపాల్ బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా

Hearing adjourned on Vijaypal bail and custody petitions
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ పై ఆరోపణలు
  • ఇటీవలే అరెస్ట్
  • ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్న సీఐడీ మాజీ అధికారి
  • బెయిల్, కస్టడీ పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వ హయాంలో చిత్రహింసలు పెట్టిన కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయపాల్ గుంటూరు జైలులో ఉన్నారు. 

ఇవాళ విజయపాల్ బెయిల్ పిటిషన్, సీఐడీ అధికారుల కస్టడీ పిటిషన్లపై గుంటూరు కోర్టు విచారణ చేపట్టింది. వాదనల అనంతరం విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ ఈ నెల 30న ఉంటుందని పేర్కొంది. 

కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ సుప్రీంకోర్టు వరకు వెళ్లడం తెలిసిందే. అయితే అత్యున్నత న్యాయస్థానంలో సైతం ఆయనకు నిరాశే ఎదురైంది. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు.
Raghurama Custodial Torture Case
Vijaypal
CID
Bail
Custody

More Telugu News