Chandrababu: మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు

CM Cbandrababu attends minister TG Bharat daughter wedding in Hyderabad
  • హైదరాబాదులో టీజీ భరత్ కుమార్తె వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన ఏపీ సీఎం
  • కొత్త దంపతులకు శుభాకాంక్షలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహం గురువారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబు వధూవరులు ఆర్యా పాన్య, వెంకట శ్రీ నలిన్‌ను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న కొత్త దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

టీజీ భరత్ గత ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 48 ఏళ్ల టీజీ భరత్ ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. టీజీ భరత్ తండ్రి టీజీ వెంకటేశ్ సీనియర్ రాజకీయవేత్త అని తెలిసిందే.
Chandrababu
TG Bharat
Daughter Wedding
Hyderabad
TDP
Andhra Pradesh

More Telugu News