Revanth Reddy: రేవంత్ తో సినీ ప్రముఖుల సమావేశం.. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న నాగార్జున

Nagarjuna reached Command Control Center to meet Revanth Reddy
  • రేవంత్ రెడ్డితో 36 మంది సినీ ప్రముఖుల సమావేశం
  • సీసీసీకి చేరుకుంటున్న సినీ ప్రముఖులు
  • కాసేపట్లో అక్కడకు రానున్న సీఎం, మంత్రులు
గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇండస్ట్రీకి చెందిన 36 మంది ప్రముఖులు సీఎంతో భేటీ కానున్నారు. హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంతో వీరు చర్చించనున్నారు. 

ఇప్పటికే నాగార్జున, మురళీమోహన్, రాఘవేంద్రరావు, దిల్ రాజు, సి.కల్యాణ్, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, శంకర్, బోయపాటి శ్రీను తదితరులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. 

ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. కాసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ కూడా ఇక్కడకు చేరుకున్నారు. కాసేపట్లో సీఎం, మంత్రులు ఇక్కడకు చేరుకోబోతున్నారు.
Revanth Reddy
Congress
Tollywood

More Telugu News