Jani Master: జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నిర్ధారించిన పోలీసులు

Narsingi police files charge sheet on Jani master
  • జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు
  • లైంగిక వేధింపులు నిజమేనంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
  • ప్రస్తుతం బెయిల్ పై ఉన్న జానీ మాస్టర్
ప్రముఖ సినీ కొరియెగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈవెంట్ల పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 

తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. లైంగిక వేధింపుల కేసు కారణంగా నేషనల్ అవార్డును జానీ మాస్టర్ కోల్పోయిన సంగతి తెలిసిందే.


Jani Master
Tollywood

More Telugu News