Tollywood Celebrities: రేపు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ

Tomorrow Tollywood Celebrities to Meet Telangana CM Revanth Reddy
  • ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో ఉద‌యం 10 గంట‌ల‌కు సీఎంతో స‌మావేశం
  • సీఎంతో భేటీపై హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు దిల్ రాజు స‌మాచారం
  • తాజా ప‌రిణామాలు, చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై భేటీలో చ‌ర్చ‌
గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో స‌మావేశం కానున్నారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు అంద‌రం క‌లిసి రేపు ముఖ్య‌మంత్రిని క‌లుస్తామ‌ని దిల్ రాజు వెల్ల‌డించారు. సీఎంతో భేటీపై హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు దిల్ రాజు స‌మాచారం ఇస్తున్నారు. 

కాగా, ఈ స‌మావేశంలో తాజా ప‌రిణామాలు, చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు అల్లు అర‌వింద్‌, మైత్రి మూవీ మేక‌ర్స్‌తో పాటు వెళ్లి కిమ్స్ ఆసుప‌త్రిలో శ్రీతేజ్‌ను దిల్ రాజు ప‌రామ‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ క‌లిసి రేవ‌తి కుటుంబానికి రూ.2కోట్ల సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 
Tollywood Celebrities
Revanth Reddy
Dil Raju
Tollywood

More Telugu News