YS Jagan: త‌ల్లితో క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్‌

YS Jagan Participated in Christmas Celebrations with His Mother YS Vijayamma
  • నాలుగు రోజుల క‌డప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో వైఎస్ జ‌గ‌న్
  • పులివెందుల సీఎస్ఐ చ‌ర్చిలో క్రిస్మ‌స్ వేడుక‌లు
  • త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి పాల్గొన్న మాజీ సీఎం
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాలుగు రోజుల క‌డప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ పులివెందుల సీఎస్ఐ చ‌ర్చిలో జరిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో త‌న త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌ల్లి చేయి ప‌ట్టుకుని కేక్ క‌ట్ చేయించారు. కుమారుడిని ద‌గ్గ‌రకు తీసుకుని త‌ల్లి విజ‌య‌మ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. 

అంత‌కుముందు క్రిస్మ‌స్ వేడుక‌ల కోసం చ‌ర్చికి చేరుకున్న జ‌గ‌న్‌కు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇక ఇడుపుల‌పాయ ప్రేయ‌ర్‌ హాల్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో జ‌గ‌న్‌, విజ‌య‌మ్మ‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. గురు, శుక్ర‌వారం కూడా మాజీ సీఎం క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. కాగా, క్రిస్మ‌స్ వేడుక‌ల సంద‌ర్భంగా కొత్త‌ సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ను జ‌గ‌న్ ఆవిష్క‌రించారు.   
YS Jagan
YS Vijayamma
Christmas Celebrations
YSRCP
Pulivendula
Andhra Pradesh

More Telugu News