Pawan Kalyan: గుడివాడ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan inspects drinking water schemes in Gudivada constituency
  • ఎమ్మెల్యే విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం
  • 44 గ్రామాల తాగునీటి సమస్యపై యుద్ధప్రాతిపదికన చర్యలు
  • జనవరి నాటికి ఆయా గ్రామాలకు తాగునీరు అందిస్తామని వెల్లడి
కలుషిత నీటితో జనం ఇబ్బంది పడుతున్నారని, 44 గ్రామాల ప్రజల తాగునీటి సమస్యను తీర్చాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేసిన విజ్ఞప్తిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన యంత్రాంగం రక్షిత తాగునీరు అందించేందుకు పనులు ప్రారంభించింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

గుడివాడ నియోజకవర్గంలోని 44 గ్రామాల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. కలుషిత నీటి వల్ల జనం ఆనారోగ్యం పాలవుతుండడంతో స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పవన్ ఆదేశాలతో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు పనులు చేపట్టారు. 40 ఫిల్టర్ బెడ్లను మార్చి, రక్షిత తాగునీరు అందించేందుకు పనులు మొదలు పెట్టారు. ఈ పనులను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. వచ్చే జనవరి నాటికి 44 గ్రామాల ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తామని చెప్పారు.
Pawan Kalyan
AP Dy CM
Gudivada
44 villages
Drinking water
Janasena

More Telugu News