అగ్రిగోల్డ్ బాధితులకు సకాలంలో న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలి: ఏపీ సిఎస్
- అగ్రిగోల్డ్ ఆస్తులపై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
- అగ్రిగోల్డ్ కు సంబంధించి వివిధ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎస్
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించిన సీఐడీ ఐజి వినీత్ బ్రిజ్ లాల్
ఈ సమావేశంలో సీఐడీ ఐజి వినీత్ బ్రిజ్ లాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ అగ్రిగోల్డ్ మోసానికి సంబంధించి మొత్తం 23 జిఓలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసు తొమ్మిది రాష్ట్రాలతో ముడిపడి ఉందని ఈ కంపెనీ అన్ని రాష్ట్రాల్లో కలిపి 19 లక్షల 18వేల 865 మంది డిపాజిట్‌దార్ల నుండి మొత్తం సుమారు 6,380 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసి మోసం చేసిందని వివరించారు. ఈ కేసును వేగవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ఈ సమావేశంలో ఏపీ ఐఐసి విసీ అండ్ ఎండి అభిషిక్త్ కిషోర్, న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభా దేవి, హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్‌గా డీజీపీ ద్వారకా తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.