High Court: కేసీఆర్‌, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊర‌ట‌

Big Relief for KCR and Harish Rao in the High Court
  • మేడిగ‌డ్డ బ్యారేజీ పిల్ల‌ర్‌ కుంగుబాటు కేసు
  • విచార‌ణ కోసం కేసీఆర్‌, హరీశ్‌రావుకు భూపాల‌ప‌ల్లి జిల్లా కోర్టు ఆదేశాలు
  • జిల్లా సెష‌న్స్‌ కోర్టు ఇచ్చిన ఆ ఆదేశాల‌ను స‌స్పెండ్ చేసిన హైకోర్టు
మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగుబాటు విష‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు భూపాల‌ప‌ల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను హైకోర్టు స‌స్పెండ్ చేసింది. జిల్లా సెష‌న్స్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలు స‌రిగా లేవ‌ని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హ‌రీశ్‌రావు కార‌ణ‌మంటూ జిల్లా కోర్టులో పిటిష‌న్ వేసిన రాజ‌లింగ‌మూర్తికి న్యాయ‌స్థానం నోటీసులు జారీ చేసింది. 

ఈ అంశంలో జిల్లా కోర్టుకు విచార‌ణ ప‌రిధి లేద‌ని కేసీఆర్‌, హ‌రీశ్‌రావు త‌రఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఇంత‌కుముందు హైకోర్టు, సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పుల‌ను న్యాయ‌వాది గుర్తు చేశారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు భూపాల‌ప‌ల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను సస్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. తదుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 7వ తేదీకి వాయిదా వేసింది. 


High Court
KCR
Harish Rao
Telangana

More Telugu News