cm chandrababu: అదే నా లక్ష్యం: ఏపీ సీఎం చంద్రబాబు

cm chandrababu participated in semi christmas celebrations Vijayawada
  • విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్ధిక సాయం చేయడం ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వమేనన్న సీఎం చంద్రబాబు
  • మైనార్టీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న సీఎం చంద్రబాబు
ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని బాగు చేయాలన్నదే తన లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో నిన్న (సోమవారం)  రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

గత ఆరు నెలలుగా అహోరాత్రులు పరిశోధన చేస్తున్నా గత ఐదేళ్లుగా జరిగిన విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు పూర్తి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తామే పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. గత ఐదేళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్ధిక సాయం చేయడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. 

గత పాలకులు ఐదేళ్లలో క్రైస్తవ అనుబంధ విద్యాసంస్థలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. మైనార్టీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి సీఎం చంద్రబాబు క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  
.
cm chandrababu
semi christmas celebrations
Vijayawada
Andhra Pradesh

More Telugu News