P Narayana: ఐదు అంతస్తుల వరకు అనుమతులు అవసరం లేదు... ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు: మంత్రి నారాయణ

Permissions not required for up to 5 storied buildings says minister Narayana
  • మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తే అనుమతులు వస్తాయన్న నారాయణ
  • వైసీపీ హయాంలో మున్సిపల్ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణ
  • ఆధునిక సాంకేతికతతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడి
పట్టణ ప్రాంతాల్లో ఐదు అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. లేఅవుట్, భవనాలకు సంబంధించి మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తే అనుమతులు వస్తాయని చెప్పారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి అనుమతులు పొందవచ్చని తెలిపారు. ఇతర శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని పట్టణాల్లో రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, వరదనీరు, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై 15 రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాత పన్ను బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

వైసీపీ హయాంలో మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించారని నారాయణ ఆరోపించారు. ప్రస్తుతం పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెప్పారు. వైజాగ్ లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక విధానంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు.
P Narayana
Telugudesam

More Telugu News