Looteri Dulhan: ‘దోపిడీ పెళ్లి కూతురు’.. మూడు పెళ్లిళ్లు.. రూ. 1.25 కోట్ల లూటీ!

3 Marriages and collect Over Rs One Crore How Looting Bride Targeted Rich Men
  • ‘పెళ్లి కూతురి’ పదేళ్ల ఆగడాలకు చెక్ పెట్టిన జైపూర్ పోలీసులు
  • మ్యాట్రిమోనీ సైట్లలో చూసి విడాకులు తీసుకున్న వారు, భార్యలు మరణించిన వారికి గేలం
  • వివిధ రాష్ట్రాల్లో పెళ్లిళ్లు.. ఆపై కేసు పెట్టి వేధింపులు
  • సెటిల్‌మెంట్ కోసం లక్షల్లో వసూలు
పెళ్లి పేరుతో అందిన కాడికి దోచుకుని పరారయ్యే ‘దోపిడీ పెళ్లి కూతురు’కు పోలీసులు సంకెళ్లు వేశారు. పెళ్లి చేసుకోవడం, ఆపై సెటిల్‌మెంట్ పేరుతో పెద్దమొత్తంలో దండుకునే నిందితురాలి ఆగడాలకు పదేళ్ల తర్వాత చెక్ పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా అలియాస్ నిక్కి 2013లో తొలుత ఆగ్రాకు చెందిన వ్యాపారిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు భర్త కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. అనంతరం రూ. 75 లక్షలు వసూలు చేసి కేసును ఉపసంహరించుకుంది. 

2017లో సీమా గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఈ క్రమంలో రూ. 10 లక్షలు దండుకుంది. అనంతరం గతేడాది జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అనంతరం రూ. 36 లక్షల విలువైన నగలు, నగదుతో ఉడాయించింది. ఆ కుటుంబం కేసు పెట్టడంతో నిందితురాలు సీమాను తాజాగా జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

నిందితురాలు మ్యాట్రిమోనియల్ సైట్లలో చూసి భార్యలను కోల్పోయిన వారు, విడాకులు అయిన వారిని ఎంచుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. అలా వివిధ రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుని ఇప్పటి వరకు రూ. 1.25 కోట్లను సెటిల్‌మెంట్ల రూపంలో వసూలు చేసినట్టు పేర్కొన్నారు. 
Looteri Dulhan
Jaipur
Seema
Uttarakhand
Crime News

More Telugu News