Job Notifications: రైల్వేలో 1,036 ఖాళీలు.. వివరాలు ఇవే

Indian Railway recruitment Board has announced post vacancies
  • వేర్వేరు కేటగిరీల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు
  • వివరాలు వెల్లడించిన రిక్రూట్‌మెంట్ బోర్డు
  • త్వరలోనే భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • జనవరి 7 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యే అవకాశం
భారతీయ రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కీలక అప్‌డేట్ వచ్చింది. వేర్వేరు కేటగిరీల్లో 1,036 ఖాళీలు ఉన్నాయని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీతో పాటు పలు ఖాళీలు ఉన్నాయని తెలిపింది.

ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ జనవరి 7, 2025 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరి 6, 2025 వరకు గడువు ఉండొచ్చని, ఈ మేరకు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. ఉద్యోగ అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, రిజర్వేషన్లు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలపై నోటిఫికేషన్‌ వచ్చాకే స్పష్టత రానుంది.

ఖాళీలు ఇవే..
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ -187, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ -338, సైంటిఫిక్ సూపర్‌వైజర్ (ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్) -03, చీఫ్ లా అసిస్టెంట్-54, పబ్లిక్ ప్రాసిక్యూటర్-20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్(ఇంగ్లీష్ మీడియం)-18, 
సైంటిఫిక్ అసిస్టెంట్ -02, జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ- 130, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్- 03, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్-59, లైబ్రేరియన్-10, సంగీత ఉపాధ్యాయుడు (ఉమెన్స్)- 03, ప్రైమరీ రైల్వే టీచర్- 188, అసిస్టెంట్ టీచర్ (ఫిమేల్ జూనియర్ స్కూల్)-02, ల్యాబ్ అసిస్టెంట్ / స్కూల్-07, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3(కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్)-12 ఉన్నాయని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెల్లడించింది.
Job Notifications
RRB
Indian Railways
Job News

More Telugu News