Sandhya Theatre: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మెరుగుపడ్డ చిన్నారి శ్రీతేజ ఆరోగ్యం

Sri Teja wounded in Sandhya theatre stampede recovering
  • తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి
  • కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు
  • శ్రీతేజ కళ్లు తెరుస్తున్నాడని తెలిపిన వైద్యులు
'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్ హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్న శ్రీతేజ కళ్లు తెరుస్తున్నాడట. చికిత్సకు స్పందిస్తున్నాడట. ట్యూబ్ ద్వారా చిన్నారికి ఆహారం అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్పారు.
Sandhya Theatre
Sri Teja

More Telugu News