Same Sex Couple: యూపీలో పెళ్లి చేసుకున్న ఇద్ద‌రు యువ‌తులు.. ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే..!

Same Sex Couple In Uttar Pradesh Gets Gender Change To Get Married
  • ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘ‌ట‌న‌
  • లింగమార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకుని మ‌రీ పెళ్లాడిన యువ‌తులు
  • కుటుంబాల ఆశీర్వాదంతో గ‌త నెల‌ 25న ఘ‌నంగా వివాహం
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇద్దరు యువ‌తులు వివాహం చేసుకున్నారు. రాణు, జ్యోతి అనే ఇద్దరు యువ‌తులు ఇలా తాజాగా కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో వారి కుటుంబాల అనుమ‌తితో వివాహ‌బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, వారిలో ఒకరు సామాజిక అడ్డంకుల‌ను అధిగ‌మించేందుకు లింగమార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు.  దీనికోసం వారు సుమారు రూ. 7 లక్షలు ఖర్చు చేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో ఇంద్ర గుప్తా అనే వ్య‌క్తి న‌గ‌ల దుకాణం న‌డుపుతున్నాడు. అత‌ని కుమార్తె శివాంగి. అయితే, ఒక‌రోజు ఆ న‌గ‌ల దుకాణానికి జ్యోతి అనే యువ‌తి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య మాట‌లు క‌లిశాయి. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ త‌ర‌చూ మాట్లాడుకోవ‌డం చేశారు. ఈ క్ర‌మంలో బ్యూటీ పార్లర్ తెరవడానికి జ్యోతి ఆమెను అద్దెకు ఒక షాప్‌ అడిగింది. దాంతో శివాంగి ఆమెకు త‌మ దుకాణం ఉన్న భ‌వ‌నంలోనే ఓ గ‌దిని అద్దెకు ఇచ్చింది. ఆ త‌ర్వాత వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం, చివరికి ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే, స్వలింగ వివాహం వల్ల సామాజిక అవమానం త‌ప్ప‌ద‌నుకున్నారు. దాంతో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శివాంగికి లింగమార్పిడి ఆప‌రేష‌న్ చేయించాల‌ని నిర్ణయించుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె లక్నో, ఢిల్లీలోని వైద్యులను సంప్రదించి లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకుంది. అనంత‌రం ఆమె తన పేరును శివంగి నుంచి రాణుగా మార్చుకుంది. అటు వారి ప్రేమ‌ను ఇరువురి కుటుంబాలు కూడా అంగీక‌రించాయి. దాంతో ఈ జంట వారి కుటుంబాల ఆశీర్వాదంతో నవంబర్ 25న పెళ్లి చేసుకున్నారు.
Same Sex Couple
Uttar Pradesh
Marriage

More Telugu News