Chandrababu: భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు

Chandrababu review meeting on rains
  • అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
  • సీఎంఓ అధికారులతో చంద్రబాబు సమీక్ష
  • అన్ని స్థాయుల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని... వర్షాల అనంతరం పంట నష్టం వివరాలను సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని చెప్పారు. అన్ని స్థాయుల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేయాలని ఆదేశించారు.
Chandrababu
telu
Rains

More Telugu News