ఆ ప్రచారం నిరాధారం.. టాటా గ్రూప్ కీలక ప్రకటన

  • ‘స్టార్‌బక్స్’ భారత్‌ నుంచి నిష్క్రమించడం లేదు
  • నిరాధార ప్రచారం జరుగుతోంది
  • ఊహాగానాలను ఖండించిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్
  • 2012 నుంచి భారత్‌లో ఇరు కంపెనీల జాయింట్ వెంచర్‌
ప్రముఖ కాఫీ చైన్ ‘స్టార్‌బక్స్’ భారత మార్కెట్ నుంచి నిష్ర్కమించబోతోందంటూ కొన్ని రోజులుగా వెలువడుతున్న మీడియా కథనాలపై టాటా గ్రూపు సంస్థ ‘టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్’ క్లారిటీ ఇచ్చింది. స్టార్‌బక్స్‌పై జరుగుతున్న ప్రచారం నిరాధారమని కొట్టిపారేసింది. ఊహాగానాలను ఖండించింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, బీఎస్ఈ లిమిటెడ్, కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు గురువారం నాడు లేఖ రాసింది. జరుగుతున్న ప్రచారాలను అంశాల వారీగా ఖండించింది. 

కాగా, అధిక నిర్వహణ వ్యయాలు, తక్కువ లాభాల కారణంగా భారత్‌లో స్టార్‌బక్స్ తన కార్యకలాపాలను మూసివేయవచ్చంటూ ప్రచారం జరుగుతోంది. ‘ధర ఎక్కువ, రుచి తక్కువ, అందుకే నష్టాలు పెరుగుతున్నాయి’ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీంతో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రంగంలోకి దిగి ప్రకటన చేసింది. 

టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్ ద్వారా అక్టోబర్ 2012లో స్టార్‌బక్స్ భారత్‌లో తన వ్యాపారాన్ని మొదలుపెట్టింది.


More Telugu News