KTR: భయపడటం లేదు.. విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తీసుకున్నా: కేటీఆర్

I am not afraid of ACB case says KTR
  • ఈ-కార్ రేసింగ్ లో పైసా అవినీతి కూడా జరగలేదన్న కేటీఆర్
  • కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదని వ్యాఖ్య
  • ఓఆర్ఆర్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో కేటీఆర్ ను ఏ1గా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ గా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసుపై తాను భయపడటం లేదని కేటీఆర్ చెప్పారు. ఇందులో పైసా అవినీతి కూడా జరగలేదని తెలిపారు. లీగల్ గా తాము ముందుకెళతామని అన్నారు. ఈ-కార్ రేసింగ్ పై మంత్రిగా తాను విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తీసుకున్నానని చెప్పారు. కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదని అన్నారు.

ఈ-కార్ రేసింగ్ లో అవినీతి జరగలేదని, ప్రొసిజర్ సరిగా లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా ముఖ్యమంత్రే అందరినీ పక్కదోవ పట్టిస్తున్నారా? అని ప్రశ్నించారు. సీఎంకు సమాచార లోపం ఉందని చెప్పారు.

ఓఆర్ఆర్ టెండర్ల పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్ తో విచారణ జరిపిస్తే... అందులో ఉండే అధికారులు ప్రభుత్వం మాట వింటారని చెప్పారు. రేవంత్ కింద పని చేసే అధికారులతో న్యాయం జరగదని అన్నారు.
KTR
BRS
E Car Racing

More Telugu News